వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు

వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు

BDK: భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన వసంత తీర్థాన్ని చల్లుతూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఊయలలో ఉంచి డోలోత్సవంగా సేవలు చేశారు.