బస్సు, లారీ ఢీ.. తప్పిన ప్రమాదం

బస్సు, లారీ ఢీ.. తప్పిన ప్రమాదం

ADB: నేరడిగొండ మండలం కుప్టి సమీపంలో శనివారం అర్ధరాత్రి బస్సు ప్రమాదం జరిగింది. స్ధానికుల వివరాల ప్రకారం.. గోరఖ్ పూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు, లారీ ఢీకొన్నాయి. బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిని అద్దం పగిలి పోయిందని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.