'అందరి సహకారంతోనే జిల్లాను ముందంజలో నిలుపగలిగాం'

NZB: దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు.