ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: రాజోలు అప్పన రాముని లంకకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీసులను MLA దేవ వరప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా టికెట్ తీసుకుని ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. అయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు సఖినేటిపల్లి నుంచి గీతా మందిరం మీదుగా వెళ్లే ఈ బస్సు సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.