చెవుటూరు సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకరణ

NTR: జి.కొండూరు మండలం చెవుటూరు, పీఏసీఎస్ త్రిసభ్య ఛైర్మన్‌గా మురళీకృష్ణ, కమిటీ సభ్యులు ప్రత్తిపాటి యస్సయ్య, కోలా వెంకట నారాయణలు సొసైటీలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. త్రిసభ్య కమిటీని అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలని పేర్కొన్నారు.