ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
VSP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గాజువాక రాజారాజేశ్వరి ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. వైసీపీ గాజువాక నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు పల్ల చిన్నతల్లి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. అనంతరం మహిళల సాధికారతపై నాయకులు ప్రసంగించారు.