కోడిపందాల శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

కోడిపందాల శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని మర్రిచెట్టపాలెంలో కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3600 నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోడిపందాలు ఆడటం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.