ఈనెల 25న వాణిజ్య దుకాణాలకు బహిరంగవేలం
VSP: GVMC జోన్-4 పరిధిలో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్, జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ కాంటీన్‌కు నవంబర్ 25న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ ఎమ్. మల్లయ్య నాయుడు సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు GVMC జోన్-4 జోనల్ ఆఫీసు వద్ద ఆరోజు ఉదయం 11 గంటలకు హాజరుకావాలన్నారు.