వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవం
JGL: కథలాపూర్ మండలం రాజారామ్ తండా గ్రామంలో సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. సర్పంచ్ స్థానానికి తిరుపతి నాయక్ ఒక్కరే నామినేషన్ వేశారు. నాలుగు వార్డు స్థానాలకు గానూ లకావత్ రాజేందర్, లకావత్ పద్మ, లకావత్ జ్యోతి, భూక్యా లక్ష్మి నామినేషన్ వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని ప్రకటించారు.