వేరుశెనగ రికార్డు ధరల వివరాలు..!

వేరుశెనగ రికార్డు ధరల వివరాలు..!

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం వేరుశనగ ధరలు గణనీయంగా పెరిగాయి. మొదటి రకం క్వింటాల్‌కు రూ.11,007, రెండో రకం రూ.9,569, మూడో రకం రూ.6,069 ధరలు నమోదయ్యాయి. మినుములు గరిష్ఠంగా రూ.8,889 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 8,169 బస్తాల వేరుశనగ మార్కెట్‌కు రాగా, మంచి ధరలతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.