మంత్రి లోకేష్ మరో ఆసక్తికర ట్వీట్
AP: మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఈ నెలలో వరల్డ్ ఛాంపియన్స్ విశాఖకు వస్తున్నారు.. ఎవరో చెప్పండి?' అంటూ ట్వీట్‌లో ప్రశ్నించారు. దీనికి పలువురు నెటిజన్లు అంచనా వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. లోకేష్ మరిన్ని వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.