విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

ATP: ఇటీవల పామిడి పర్యటనకు వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు పట్టణ ప్రజలు పలు కాలనీలలో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. వెంటనే ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో సోమవారం విద్యుత్ శాఖ అధికారులు లో వోల్టేజ్ ఉన్న కాలనీలలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి, నూతన విద్యుత్ తీగలను అమర్చారు.