నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే
ELR: మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రతిఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం గణపవరం మండలం పిప్పర, కోమట్లపాలెం, కాశిపాడు నేలకొరిగిన వరి వ్యవసాయ క్షేత్రాలను వాసుబాబు పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం చివరి గింజ వరకు రైతు నుంచి కొనుగోలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.