జిల్లా పోటీల్లో మెరిసి.. రాష్ట్ర స్థాయికి ఎంపిక
SRCL: వేములవాడ మండలం నాగయ్యపల్లికి చెందిన రొండి నిశాంత్ అనే విద్యార్థి రాష్ట్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బోయినపల్లిలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. నిశాంత్ ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 11 నుంచి హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొననున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.