సినీ నటుడు కృష్ణ విగ్రహం తొలగింపు
విశాఖ జగదాంబ సెంటర్‌లో ఉన్న సినీ నటుడు, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం సోమవారం అధికారులు తొలగించారు. జనసేన జెండా ఉండే స్థానంలో కృష్ణ విగ్రహం ఎలా పెడతారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే అనుమతి లేదనే కారణంతో విగ్రహాన్ని తొలగించినట్లు వారు తెలిపారు. దీనిపై పలువురు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.