సాయి బోధనలతో జీవితంలో ప్రశాంతత: సచిన్

సాయి బోధనలతో జీవితంలో ప్రశాంతత: సచిన్

సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయనను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాబాను స్మరించుకున్నారు. సాయి బోధనలు తన జీవితంలో శాంతిని, ఉద్దేశాన్ని, ఆశను నింపుతాయని తెలిపారు. ఈనెల 19న జరిగిన శత జయంతి వేడుకల్లో స్వయంగా పాల్గొనడంపై కృతజ్ఞత వ్యక్తం చేశారు. కష్ట సమయాల్లో కూడా బాబా వాక్కులు తమను నడిపిస్తాయని ఒక ప్రకటన విడుదల చేశారు.