'సరైన అవగాహనతో అభ్యసించాలి'
ప్రకాశం: మార్కాపురం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లలో 'బాగా చదవండి పరీక్షలు సిద్ధం కండి' అనే అంశంపై అవగాహన కల్పించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఆరోగ్య కన్వీనర్ డా. శరత్ మాట్లాడుతూ.. సరైన అవగాహనతో చదివి రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేలా ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలన్నారు.