నేడు సంతమాగులూరులో మంత్రుల పర్యటన
BPT: సంతమాగులూరులో శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సచివాలయ భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.