నాటు తుపాకీతో అన్నను చంపిన తమ్ముడు
AKP: చీడికాడ మండలంలోని తురువోలు గ్రామంలో జోగా రాము అనే వ్యక్తిని అతని తమ్ముడు జోగా దేముల్లు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. భూ తగాదాల కారణంగా అన్నదమ్ముల మధ్య మంగళవారం వివాదం జరిగింది. గొడవ జరిగిన అనంతరం కల్లాల వద్ద ఉన్న అన్నను తమ్ముడు నాటు తుపాకితో కాల్చిడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.