విజేతలను అభినందించిన ఎస్పీ
JGL: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడ పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీస్ టీంను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలు మన శారీరక ఆరోగ్యానికి బలాన్ని అందించడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడలతో మనలో పోటీ భావన పెరుగుతుంది, అలాగే సహచరులను ప్రోత్సహించే స్ఫూర్తి కూడా వస్తుందని అన్నారు.