'విద్యా బోధనలో మెలకువలు పాటించండి'

'విద్యా బోధనలో మెలకువలు పాటించండి'

SKLM: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న బోధనలో మెలకువలు పాటించాలని ఎంఈఓ 2 పేడాడ దాలినాయుడు తెలిపారు. గురువారం ఉదయం నరసన్నపేట మండలం మాకివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మమేకమయ్యారు. బోధన పట్ల విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు.