ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని వాగు నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గురువారం పట్టుకున్నామని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు నేరెళ్ల శ్రీనివాస్, బండారి అరవింద్‌లపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.