రాజశేఖర్ రెడ్డి కూతురు పెళ్లికి జగన్‌కు ఆహ్వానం

రాజశేఖర్ రెడ్డి కూతురు పెళ్లికి జగన్‌కు ఆహ్వానం

ATP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తోపుదుర్తి కుటుంబసభ్యులు కలిశారు. నవంబర్ 23న రాప్తాడు సమీపంలో జరిగే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కూతురు మోక్షిత విష్ణుప్రియా రెడ్డి వివాహానికి రావాలని కోరుతూ.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలో జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.