'ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VKB: ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. కొడంగల్‌లో వ్యక్తి నకిలీ ఫోన్ పే యాప్‌లో దుకాణదారుడిని మోసం చేశాడు. డబ్బులు చెల్లించినట్లు అతడి ఫోన్‌లో చూపించినా, షాపు యజమాని ఖాతాలో జమ కాలేదు. ఇలాంటి మోసాలను నివారించడానికి, డబ్బులు వచ్చాయన్న మెసేజ్లను గుడ్డిగా నమ్మకుండా, బ్యాంకు అధికారిక సందేశమో కాదో చూసుకోవాలన్నారు.