పార్టీలకతీతంగా గెలిపించుకుందాం: ఎమ్మెల్యే

MBNR: తెలుగువాడైన ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకతీతంగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌కు విచ్చేసిన సుదర్శన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. ఆయన గెలుపు తెలుగువారి గౌరవాన్ని పెంపొందిస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.