VIDEO: ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ
KDP: సింహాద్రిపురం మండలంలోని బిదినంచెర్లలో నూతనంగా నిర్మించిన శ్రీ యేన మీద గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీని దుశ్శాలవతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.