నైజీరియాలో విద్యార్థుల కిడ్నాపర్లకు పోప్ విజ్ఞప్తి
నైజీరియాలో విద్యార్థులను కిడ్నాప్ చేసిన ఘటనపై పోప్ లియో-14 స్పందించారు. ఈ సందర్భంగా బందీలను విడిచి పెట్టాలని సాయుధులను విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు సురక్షితంగా తిరిగిరావాలని అందరూ ప్రార్థించాలని కోరారు. నైగర్ రాష్ట్ర సెయింట్ మేరీ కేథలిక్ స్కూలు నుంచి 303 మంది విద్యార్థులు అపహరణకు గురైన విషయం తెలిసిందే. కాగా వీరిలో 50 మంది సురక్షితంగా తప్పించుకున్నారు.