సీఎంను కలిసిన టీడీపీ నేతలు
KDP: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి కడప జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల TDP ఇంఛార్జ్ బీటెక్ రవి, పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి కడప ఎయిర్ పోర్టులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పులివెందుల అభివృద్ధి, రైతుల సమస్యలపై వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు.