VIDEO: హైవేపై ప్రమాదం..తీవ్ర గాయాలు

VIDEO: హైవేపై ప్రమాదం..తీవ్ర గాయాలు

TPT: నాయుడుపేట-చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.