హై టెన్షన్.. ప్రతి బస్సుకు కానిస్టేబుల్

హై టెన్షన్.. ప్రతి బస్సుకు కానిస్టేబుల్

VKB: పరిగిలో బస్టాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బంద్‌ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు బస్సులను బయటకు తీశారు. దీంతో సమ్మె చేపట్టిన కార్మికులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో భద్రత దృష్ట్యా ప్రతి బస్సులో ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. పోలీసుల పహారాలో బస్సులు నడుస్తున్నాయి.