ఉద్రిక్తత.. బస్సును అడ్డుకున్న కార్మికులు

ఉద్రిక్తత.. బస్సును అడ్డుకున్న కార్మికులు

HNK: పరకాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమ్మె కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. డిపో మేనేజర్ ఒక ప్రైవేటు డ్రైవర్‌తో పరకాల నుంచి హుజురాబాద్‌కి ప్రయాణికులతో బస్సు నడిపించే ప్రయత్నం చేశారు. అక్కడే సమ్మెచేస్తున్న కార్మికులు బస్సును అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.