వృద్ధురాలితో భూమిపూజ చేయించిన మంత్రి
NGKL: కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మంజూరైన ఇందిరమ్మ ఇంటి భూమిపూజకు ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు పేరుతో ఇళ్లు మంజూరు చేశారు. ఆయన భార్య గర్భిణి కావడంతో పూజలో పాల్గొనలేదు. లక్ష్మిదేవమ్మ భూమిపూజ చేయాలని మంత్రి కోరగా ఆమె వితంతువు అని స్థానికులు చెప్పారు. ఇలాంటి సాంఘిక దురాచారాలు నమ్మకూడదన్నారు.