ఈనెల 19న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష
NLG: జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సం.నికి గానూ 6వ తరగతి, అలాగే 7 నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ఈ నెల 19న జరుగుతుందని డీఈవో బిక్షపతి తెలిపారు. 6వ తరగతి వారికి ఉ. 10- 12 గంటల వరకు, 7-10 తరగతుల వారికి మ. 2 నుంచి 4వరకు పరీక్ష ఉంటుందన్నారు. నేటి నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు.