పథకం కోసం భార్యకు రెండో పెళ్లి
MHBD: మరిపెడ మండలం భూక్యతండాలో ఆశ్చర్యకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హేమా మీసేవ కేంద్రం నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు కళ్యాణలక్ష్మి పథకం కోసం తన భార్య వినోదకు వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశాడు. వాటితో ప్రభుత్వం నుంచి రూ.2.23 లక్షలకు పైగా సొమ్ము చేసుకున్నాడు. అయితే ఆ పథకంకు ఆధార్ లింక్ లేకపోవడంతో ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.