మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మార్క్ ఫెడ్ సౌజన్యంతో సింగిల్విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని కొనుగోలు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సధ్వినియోగం చేసుకోవాలని తెలిపారు.