ప్రభుత్వ సలహాదారుల 'కేబినెట్ హోదా' రద్దు

ప్రభుత్వ సలహాదారుల 'కేబినెట్ హోదా' రద్దు

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పొదుపు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం సుఖ్విందర్ సింగ్ ప్రభుత్వం సలహాదారులు, బోర్డుల అధ్యక్షులకు కల్పించిన 'కేబినెట్ హోదా'ను తక్షణమే రద్దు చేసింది. దీనితో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల జీతభత్యాల్లో 20% కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.