వరదల నివారణకు స్ట్రాం డ్రైన్ల నిర్మాణం: మేయర్

WGL: భారీ వర్షాల వల్ల వచ్చే వరదలను తట్టుకునేలా స్ట్రాం వాటర్ డ్రైన్ల నిర్మాణం జరగాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్ట్రాం వాటర్ డ్రైన్ల ప్రాథమిక డిజైన్, ఎస్టిమేట్లను ఆమె పరిశీలించారు. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి ఈ డ్రైన్ల నిర్మాణాన్ని సమర్థవంతంగా చేపట్టేందుకు సూచనలు చేశారు.