జనసేన విస్తృతస్థాయి సమావేశానికి కమిటీల ఏర్పాటు

VSP: జనసేన పార్టీ తన విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల 30న విశాఖపట్నంలో నిర్వహించనుంది. ఈ సమావేశం కోసం 12 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు మొత్తం 28 మంది సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తామని, పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.