VIDEO: ఏడుపాయలలో దుర్గమ్మకు మంగళహారతి
MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు మంగళవారం భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణ పక్షం బహుళ షష్టి / సప్తమి సందర్భంగా దుర్గ భవాని మాతకు పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. పట్టువస్తాలు పలు వివిధ ద్రవ్యాలు సమర్పించి పుష్పాలంకరణతో మంగళహారతి చేశారు.