బోడంగిపర్తిలో 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు

బోడంగిపర్తిలో 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు

NLG: చండూరు మండలం బోడంగిపర్తిలో అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 22వ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుచున్నాయి. మూడు రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో 2వ రోజు కార్తీక శుద్ధ నవమి గురువారం ధ్వజ కుంభ ఆరాధన, అగ్నిప్రతిష్ట, మూలమంత్ర హోమము, గరుడ హోమం, శతకట్టాభిషేకం, ధ్వజారోహణ, బలిహారం, సుదర్శనహోమం కార్యక్రమాలు జరిగాయి.