జాబ్ మేళా.. 30 మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

జాబ్ మేళా.. 30 మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

GNTR: ఫిరంగిపురం దీనాపూర్ లోని సెయింట్ జెవియర్ ఫార్మసీ కళాశాలలో దివిస్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో పలు విభాగాలకు సంబంధించిన సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 30 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ దాసి జీవన్ మణి బాబు తెలిపారు.