చలికాలంలో ఒళ్లు నొప్పులా? ఇలా చేయండి
చలికాలంలో చాలా మంది తీవ్ర ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. ఇమ్యూనిటీ పనితీరు మందగించే ఈ కాలంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత, రక్త ప్రసరణ తగ్గడం, యాంటీఆక్సిడెంట్లు తగ్గడం వంటి కారణాలతో ఒళ్లు, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. పరిష్కారం కోసం వ్యాయామం, నీళ్లు ఎక్కువగా తాగడం, శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూడటం వంటివి చేయాలి. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలి.