తండ్రి తలను నరికేసిన కసాయి కొడుకు
VZM: బాడంగి మండలం గొల్లాదిలో కన్నతండ్రిని హత్య చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పక్షవాతం వ్యాధితో మంచానికి పరిమితమైన మామిడి గోవిందపై కన్నకొడుకు రాము పదునైన కత్తితో దాడి చేసి తల నరికేసాడు. శరీర భాగం నుంచి తలను వేరు చేయడంతో గ్రామస్తులు భయంభ్రాంతులకు గురవుతున్నారు. హత్య ఎందుకు చేసాడో వివరాలు తెలియాల్సి ఉంది.