'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

NRML: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. 'ప్రజా పాలన-ప్రజా ప్రణాళిక' 99 రోజులు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్మల్ పట్టణం తారక రామ్ నగర్‌లో అధికారులు పర్యటించి కాలనీలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో షేక్ తాయెద్, సాయిబాబ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.