రాజంపేట PHCని సందర్శించిన డిప్యూటీ DMHO
KMR: బీబీపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ ఇన్ఛార్జ్ డిప్యూటీ DMHO డా.విజయ మహలక్ష్మి సందర్శించారు. పీహెచ్సీ పరిధిలోగల గ్రామాలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు రిజిస్టర్లు పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ వైద్య సేవలు అందించాలన్నారు.