మెరుగైన వైద్యం అందించండి: మంత్రి దామోదర్

RR: మహేశ్వరం పరిధిలో నిన్న రాత్రి జరిగిన బస్సు ప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గాయపడిన వారిని 108 అంబులెన్సుల ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.