వైసీపీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు: నిమ్మల

వైసీపీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు: నిమ్మల

AP: ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను కూడా జగన్ ఆపేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.