"సమన్వయంతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలి"
HNK: కలెక్టర్ స్నేహ శబరీశ్ అధ్యక్షతన బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, అదే రోజు చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో ఘనంగా ప్రారంభోత్సవం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.