పిల్లలమర్రిలో ఘనంగా ముగిసిన కార్తీక మాస ఉత్సవాలు
SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీక మాస ఉత్సవాలు గురువారం ముగిశాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు, స్వాములు ఎర్రకేశ్వర, నామేశ్వర స్వామి శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర శివలింగాలకి కాశీ నుంచి తెచ్చిన గంగాజలంతో స్వామివారికి రుద్రాభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో శత కలశార్చన పూజలు నిర్వహించారు.