డబుల్‌ బెడ్‌రూమ్‌ దరఖాస్తుల పరిశీలన

డబుల్‌ బెడ్‌రూమ్‌ దరఖాస్తుల పరిశీలన

MNCL: రెండు పడకల గదుల ఇండ్ల దరఖాస్తుల పరిశీలన గురువారం బెల్లంపల్లి పట్టణం 15వ వార్డ్ లో ప్రారంభమయింది. ఆన్‌లైన్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌‌ల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోని వివరాలను దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో అధికారులు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ DE సాయి కిరణ్, RI మురళీధర్ రావు, జూనియర్ అసిస్టెంట్ సువర్ణ, GPO పాల్గొన్నారు.